ప్రమాదాలు – Delhi Poetry Slam

ప్రమాదాలు

By Venkata Ramana Prathy

బద్దలవుతున్న పుర్రెలు
నలుగుతున్న గుండెలు
తెగిపడుతున్న అవయవాలు
కాలుతున్న శరీరాలు
హాహా కారాలు
మిన్నంటిన శోకాలు

వీధిన పడుతున్న కుటుంబాలు
అస్తవ్యస్తమైన బతుకులు
ప్రాణ నష్టం ఆస్తి నష్టం
అన్నిటా అజాగ్రత్త
విలువలేని ప్రాణాలు

ఇరుకు సందులో ఇరవై కారులు
పది కర్మాగారలు
కానరాని పర్యవేక్షణ
గతుకుల రహదారులు
సూచీలను లక్షపెట్టని నిర్లక్ష్యం
ప్రమాదాలకు హేతువులు

వారోత్సవాల కంటితుడుపు చర్యలు
పాలకుల ప్రగతి పలుకులు
చాటున
కానరాని మానవ దుఃఖం

కుంటోడుగా గుడ్డోడుగా మారిన నాడు
బతుకు భారమై
అయ్యో! చావే దిక్కు అనే దైన్యం

సాటి మానవుల ప్రాణం విలువ
రెండు కన్నీటి చుక్కలు
ఆ నిజం
గుర్తెరిగిన నాడు
అన్నిటా ఆహ్లాదమే
అందరి బతుకులు ఆనందమే.


1 comment

  • చిన్న చిన్న అక్షరదోషాలు మినహాయిస్తే పదం పదం దైన్య ప్రమాదాల చిత్రాలు బాగా అమిరాయి

    Setupati Adinarayana

Leave a comment