కమనీయ గీతం కాశ్మీరం – Delhi Poetry Slam

కమనీయ గీతం కాశ్మీరం

By Usha Sastry

రమ్య రమనీయ రంగుల రాగ రంజితం 
జాలువారు హిమపాత జలక్ జలక్ నాద జల మయం,
వీనుల విందైన వింత వింత విహంగాల కిలకిల రావం
కనులకి పసందైన పచ్చని చెట్టు చేమల కొండకోనల ప్రకృతి రూపం,
మనస్సు పులకించు ఆ అందాల లోయ పలకరింపు
అణువు అణువు ఓ అందాల హరివిల్లై ఆహ్వానించు.
తనువంతా తన్మయించే నిర్మలమైన చల్లని పిల్ల గాలుల
తాకినంత నేర్పగలవీ మంచు కొండలు మధ్యమావతి రాగం
మనుష్య జాతికి ప్రకృతి ఇచ్చిన మరోవరం ఈ కాశ్మీరం.

మూర్గత్వం తో మనుష్య జాతి చేస్తోంది మరులు కొలుపు లోయని కక్షల కాష్టం,
కాలుష్యాలతో కడతేరుస్తున్నారు కమనీయమైన ఈ పర్వత సోపానం.

తుపాకీల హోరు, రాజకీయపు పోరుల మధ్య తుది విజయం ప్రకృతిదే.
అనువుగా మసలితే అందాలతో మరులు కొలిపి మురిపించకల అందం ప్రకృతిది
అమానుషంగా మార్చబూనితే మట్టి కరిపించ కల ప్రళయ శక్తి ప్రకృతిది.
భూతల స్వర్గం, భారత మాత తల మానికం, మంచుకడిగిన ముత్యం మన ఈ కాశ్మీరం
పచ్చటి పసిడి శాలువా లో మంచు అంచులో కుంకుమ పూల సింగారంలో
ముద్దులొలుకు ముగ్ద మన ఈ కాశ్మీరం.
రమ్య రమనీయ రంగుల రాగ రంజితం ఈ కాశ్మీరం.


5 comments

  • This poem shows the true beauty of Kashmir and the pain it hides

    Dharani
  • Great lines love to hear from you more

    Chaitanya
  • Very nice poetry on Kashmir beauty and its situations.

    Kiran
  • 👌

    Sailaja
  • Love it… the poem describes our beautiful Kashmir very well .

    Shravanthi

Leave a comment