మా పొదరిల్లు – Delhi Poetry Slam

మా పొదరిల్లు

By SriLakshmi Bhavani Nandamuri

 అమ్మవై గర్భముంత పదిలముగా మమ్ము మోయగా,
 చెట్టుపై గూడువై అల్లుకొని మమ్ము కాయగా,
 పగడపు దీవివై సంవృద్దిగా మమ్ము సాకగా,
 తేనెపట్టువై సమిష్టిగా మమ్ము జతచేయగా,
 
 మా పాటలు నీ పునాదిలో ప్రతిధ్వనించగా,
 మా ఆటలు నీ ఇటుకులపై తేలియాడగా,
 మా నవ్వులుతో నీ లోగిలి అలకగా,
 మా వంటలు నీ వాకిట్లో పరిమళించగా,
 
 మా ద్రుక్పధాలకు దిక్పాలకులు లా,
 మా ప్రేమలకు పోషకుని లా,
 మా భవితకు భాష్యం లా,
 మా గ్రుహమువై నీ అనుగ్రహముతో కుశలముగా సాగగా…


Leave a comment