వింతే కదా రా శివా – Delhi Poetry Slam

వింతే కదా రా శివా

By Santhosh Kaluvala

వింతే కదా రా శివా.
అంతే కదా రా శివా 
కనపడని అణువుతో...అండమూ చేసావు..శివా
అదె బ్రహ్మాండమే కదా రా...శివా
ఆ అణువు నీవే కదా రా...శివా

వింతే కదా రా శివా...
అంతే కదా రా శివా
అంతెలేని విశ్వంలో...కనపడేది ఎంతరా...శివా
కొంతే కదారా...శివా
కనుపాపలో ఒదిగే అంతే కదా రా....శివా

వింతే కదా రా శివా...
అంతే కదా రా శివా
కనపడని గాలే....కదా రా... శివా
ఉపిరి నింపేదే..కదా రా....శివా
ఆది నీవే కదా రా...శివా

అంతే కదరా...శివా
వింతే కదరా శివా...
చలనమే లేని మట్టిలో...పోసింది నీవు జీవమే కదా రా... శివా
జీవితమే కదా రా...శివా

వింతే కదా రా శివా...
అంతే కదా రా...శివా
భువిలోని ప్రతి అనుభూతి...ఆ జీవిధే కదా రా... శివా
అనుభూతే కదా రా...శివా

వింతే కదా రా శివా
అంతే కదా రా శివా
నిన్నా నువ్వే, ఇరోజా నువ్వే...రేపూ నువ్వే కదా రా శివా
కాలమే నువ్వు కదా రా..శివా 
కాలాంతకుడివీ నువ్వే కదా రా..శివా

వింతే కదా రా శివా
అంతే కదా రా శివా
ఎన్ని గిరులు ఎక్కిన...చివరకి మట్టే కదా రా..శివా
ఈ కట్టె బుడిదే కదా రా..శివా

వింతే కదా రా శివా...
అంతే కదా రా శివా
మూసిన కనుల వెనుక...రంగుల నాట్యం నిదే కదా రా శివా..
ఈ సృష్టి ని నాట్యమే  కదా రా శివా...

వింతే కదా రా శివా...
అంతే కదా రా శివా
పూర్ణము నువ్వే...శూన్యము నీవే కదా  శివా
ఆద్య అంత్య రహితుడవు నువ్వే కదా రా శివా

వింతే కదా రా శివా...
అంతే కదా రా శివా
తెలిసింది కొంత నాకు...తెలియంది ఎంత...
మాయే కదా రా...శివా
అంతా నీమాయే కదా రా..శివా

వింతే కదా రా శివా...
ఇది మాది చెప్పిన మాట..శివా
వచ్చింది నా నొట...శివా


Leave a comment