అజ్ఞాతవాసి – Delhi Poetry Slam

అజ్ఞాతవాసి

By Kowshik Ramadugu

నాలో నేనై నిరంతరం రగిలే జ్వాలని,
నిశీధిలో నిప్పుని రాజేసే అగ్నిని,
ఆవేశాన్ని ఆలోచింపజేసే ఆయుధాన్ని,
అనేక అంతర్మధనాల స్వరాన్ని,
రేపటి తరానికి దారిచూపే బాటసారిని,
నా ప్రయాణంలో నేను ఒక అజ్ఞాతవాసిని...

అజ్ఞాతంతో నిండిన అంధకారాన్ని,
అక్షరమై విరిసే అద్వైతాన్ని,
అనిశ్చితిని చెరిపివేసే విజ్ఞానాన్ని,
అవకాశం కోసం ఎదురు చూసే వైనం,
అడుగడుగున జరిగే అవమానం,
అనునిత్యం  స్ఫూర్తినిచ్చే చేరాల్సిన సంద్రం.

నా గుండెలోని భావమై కదిలే కాగితం,
సిరానుండి జాలువారే అక్షరం,
విరిసే …నాలోని కవనం, 
మురిసే… నా హృదయం,
వెల్లువిరిసే… నాలో సంతోషం,
అభినందనతో వెలిగిపోయే నా చిరునవ్వుల మొఖం.


చీకటి అజ్ఞాతంలో పొంగిన నాలో కళ,
మరో కలలో కలుద్దాం రేపటి చీకటిలో.

"గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు ఎన్నో"


Leave a comment