By Giridhar Alwar
గతించిపోయిన సిపాయి వీరుల
జీవిత గాథల తలువగనే,
ఘనించిపోయిన గుండెను సైతం
పెనుద్రవాలు కదలాడే,
అవి కన్నీటిలా క్రిందకు జారిపడే.
ఆకలి దప్పులు మరచి,
ముందుకు నడచి,
సరిహద్దున కావలికాచి,
దేశమునే తన అమ్మగనెంచి,
ప్రజలను తోబుట్టువులుగ పిలచి,
ప్రాణత్యాగానికి సైతం ఓర్చే సిపాయికి నే వందనమంటున్నా…!
నేం తలొంచి వందనం చేస్తున్నా…!
గుండెలో ధైర్యమే దైవముగా,
దేశ రక్షణయే ఊపిరిగా,
తల తెగిపడినా లెక్కచేయక,
శత్రువు గుండెను కత్తి దూసే
సిపాయి కూడా నాకు దేవుడే…!
మృత్యువు కౌగిట ఆటలాడుతూ,
భార్యా బిడ్డలపై ప్రేమను పాటగా పాడుతూ,
సరిహద్దులలో శత్రువులు
కారుమబ్బులై కమ్ముతూ ఉన్నా,
విషవాయులై ప్రబలుతూ ఉన్నా,
దేశజనుల సుఖశాంతులకై
ప్రాణాలిచ్చేవాడే ఆ మహామనిషి…
ఆ మానిసి…