ఊపిరి – Delhi Poetry Slam

ఊపిరి

By Durgadevi Kosuri

నీ ఊపిరే నీకు కాపరి…నడుమ నటించే నాట్యమయూరి
పూరకరేచక జీవనధారి..కుంభస్థానాన ఆనందలహరి
పంచప్రాణాల మూలాధారి..షట్చక్రాలకు సూత్రధారి
పంచేంద్రియాలకు అధికారి..పంచవాయువులసమధారి
అంతిమసమయ నిర్ణయధారి..మరుజన్మకుమరల కాపరి


Leave a comment