By Asha Prathy

అలుపెరుగని నీ అలల ఝరిలో నా అలజడి గడిచే
ఉరిమే నీ ఉరకల పరుగులలో నా జీవితం మళ్ళీ మొదలయ్యే
నీ గమనమే నా గమ్యం
నీ తరంగమే నా అంతరంగం
ఎగసే నీ అల
కనుమరుగై ఎలా
నను తాకేను స్వచ్చమైన స్వేచ్చలా
పరవశించేను నా మది ఇలా
నీ ప్రతిధ్వని పలికే సుప్రభాతం
ప్రతిస్పందించేను నా లోన చైతన్య రథం
ప్రత్యూష కాంతిలో దర్శనమిచ్చే ప్రాకృతిక అద్భుతం
ఉరకలు వేసేను మేల్కొన్న నవ చైతన్యం
నిను వీక్షించే ప్రతి క్షణం
చిగురించే ఆశల వైనం
కరిగిన నా కన్నీరే ఇందుకు నిదర్శనం
ప్రకృతి లోనే మనిషికి దొరికేను అంతిమ సమాధానం