By Venkata Ramana Prathy
రెక్కలు విడని పక్షులం మేము
ఎవరికీ చెందని అభాగ్యులం
పొదలలో నది ఒడ్డునో చెరువు గట్టునో లోకానికి తెలుస్తుంది మా ఉనికి
మా ఏడుపే మాకు రక్ష
దారిన పోయే దానయ్యే మాకు దక్ష
అక్కున చేర్చుకుంటే మాకు భిక్ష
లేకుంటే మాకు శిక్ష
కుక్కలకి నక్కలకి చీమలకి అవుతాము విందు భోజనం
చనిపోయేముందు ఒకరి కడుపు నింపేమన్న తృప్తి
ఎవరి పాపపంకిలాల చర్యకు ప్రాణం పోసుకున్నాము
సంఘ బలిపశువులం
బతికితే ఒక అయ్య ఇంటో లేక
అనాధ శరణాలయంలో తేలుతాయి మా బతుకులు
ఈ అమానుషం ఇలా జరగవలసిందేనా
ఎప్పుడు నశిస్తుంది ఈ కామపిశాచతత్వం