అరుదైన కానుక – Delhi Poetry Slam

అరుదైన కానుక

By Sri Lakshmi Bhavani Nandamuri 

 

కంటి కాపలా కాస్తున్నా ఏ కీడూ నీ దరి చేరనీయనని,
తల నిమిరి ధైర్యం ఇస్తున్నా నీ ఆలోచనలకి ప్రాణం పోయాలని,
కర్ణభేరి మోగిస్తున్నా అసాధ్యపు హెచ్హరికలు నీకు వినపడకూడదని,
మూగ నోము నోస్తున్నా సుక్తులతో నీ కలలు కాలరాయకూడదని,
పెదవిపై పాటగా జపిస్తున్న చిరునవ్వు చెలిమి చెరగరాదని,
చేయి చాచి యాచిస్తున్నా యాంత్రికమై పోరాదని,
మనస్సు పరచి మొక్కుతున్నా ప్రేమ జత వీడరాదని,
వినయంతో శాశిస్తున్నా విశ్వాన్ని నీ తోడు వీడరాదని,
కాలు రువ్వి కాపలా కాస్తున్నా ఏ కళ్ళెం నీ పరిశోధనా పరుగు ఆపకూడదని,
ఆత్మ అడ్డుపెడుతున్నా ఆంక్షలు నీ స్పూర్తి చెరపరాదని,
పిడికిలి తెరచి ఇస్తున్నా అమ్మగా స్వేచ్చా జీవితం అరుదైన కానుకగా


Leave a comment