BY KUNAPAREDDY MANMOHAN
రాజసం
రాక్షసం
ఒకటైతే
రావణకాష్టమే ;
అమాయకత్వానికి
అభినయం
తోడైతే
నాటకీయమే ;
అన్యాయానికి
అధర్మం
ఆద్యం పోస్తే
జీవన్మరణ పోరాటమే !
నాడు నేడు
అంతటా ఇదే
తీరు -పోరు ;
వలసలు వెళుతున్న
మందిని ఆపగలరు కానీ
పరుగులు పెడుతున్న
మనస్సుని ఆపగలరా ?
ఏ ఇజం అయితే మనకేం
మనం బ్రతకాలి హాయిగా
అంతేగా ?
బ్రతికేద్దాం ఇంకెన్నాళ్లు
తాయిలాలు తింటూ
అయ్యా అని అడుక్కుంటూ
రవి అస్తమించని సామ్రాజ్యంలో
చలి మంటలు కాచుకుంటూ !
మనకెందుకు ఈ
జీడీపీలు
డెవలప్మెంట్ లు
హ్యూమన్ రైట్స్ వైలేషన్లు
మనం బ్రతుకుదాం
తాఫీగా కాఫీ తాగుతూ
రాత్రిపూట వైన్ షాప్ లో
లిక్కర్ తాగుతూ
జి హుజూర్ అంటూ !