By Kowshik Ramadugu
అక్షరాలతో జ్ఞాపకాలను దాచుకునే అందమైన లోకం అది,
మనిషిలో ఉన్న కళని,ఊహని తిరిగి తనకే చూపించే అద్దం అది.
వ్యక్తుల మధ్య ,వ్యవస్థల మధ్య నడిచే మనిషి జీవితంలో
విజయానికి,విషాదానికి,
అవమానానికి,అభినందనలకు సాక్షి ..
ఒక వస్తువు.
జీవితంలో ఉన్న ఆనందాన్ని,
మనుషులతో చెప్పుకోలేని బాధని,
మనుసు మోస్తున్న బరువుని,
ప్రతి రోజు రాత్రి పంచుకుంటూ
ఎందరో మనుషుల గుట్టుని గోప్యాంగా దాస్తున్న గూఢచారి
అక్షరాలకు అందమైన రూపం ఇవ్వడానికి,
కలత చెందిన ప్రతి కంటికి నిద్రని ఇవ్వడానికి,
కాగితం సాయం చేస్తుంది అంటే నమ్మగలమా!
మనిషి చనిపోయే వరకు తనచేతితో ప్రయాణం చేస్తూ,
చనిపోయాక ఒక అద్భుతమైన జ్ఞాపకంగా బ్రతుకుతుంది
డైరీ
డై =Die
రీ=Rebirth