సీతా వైభవం – Delhi Poetry Slam

సీతా వైభవం

By Gnanesh Raghuram Sharan

త్రేతాయుగ వైశాఖ శుక్లపక్ష నవమి
పసి నవ్వులతో పలకరించే అవని
అయోనిజగా ఆవిర్భవించే పద్మనయనీ
నాగలి చాటుదొరికి సీతా అని పెరుపొందే రమణీ
జనకత్మాజీ జానకిగా తరింపచేసే మిథిలా పురిని
చెప్పటే కౌసల్యత్మజుడగు శ్రీరామచంద్రుని
సతీ ధర్మం లోకానికి చాటే పతివ్రతాశరోమణి
లవకుశజనని మా ఎదలో కొలువగు లోకపావని
అంజనాసుతార్చిత అయోధ్యపురి పట్టపురాణి
శరణాంటిమి తల్లి ఆ దశకంటరావణాంతకారిణి
మా తల్లీ సీతమ్మ చరితం నొసుగు సర్వశుభాలని
- జ్ఞానేష్


Leave a comment